Wednesday, July 2, 2025
E-PAPER
Homeహైదరాబాద్వివేక్ మంత్రి పదవి రావడం హర్షణీయం

వివేక్ మంత్రి పదవి రావడం హర్షణీయం

- Advertisement -

– డా.మంచాల లింగస్వామి,
– రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా). చైర్మన్, మాల పొలిటికల్ జేఏసీ.

నవతెలంగాణ – హైదరాబాద్ :డా.జి.వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాల పొలిటికల్ జేఏసీ చైర్మన్ డా.మంచాల లింగస్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డా.వివేక్‌ వెంకటస్వామికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. గూడు లేని లక్షలాది మంది పేదలకు గుడిసెలు కట్టించి నీడనిచ్చిన కాకా వెంకటస్వామి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న పేదల పెన్నిధి, అణగారిన ప్రజల ఆశాజ్యోతి . ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా గల్లీ నుండి డిల్లీ వరకు, పార్లమెంటులో తెలంగాణ వాణిని వినిపించిన గొప్ప నాయకుడు. తన ఆగమనంతో కాంగ్రెసు పార్టీ గమనాన్ని మార్చి అధికారంలోకి తీసుకొచ్చిన గేమ్ చేంజర్ డా.జి.వివేక్‌కి మంత్రి పదవి రావడం హర్షణీయం. కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. ఆయనకు హోం అఫైర్స్ లాంటి సముచితమైన శాఖను కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం” అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -