భూపాలపల్లి తహసిల్దార్ వి. శ్రీనివాసులు
నవతెలంగాణ – భూపాలపల్లి : భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, కావున రైతులు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి తహసిల్దార్ వి. శ్రీనివాసులు తెలిపారు. సోమవారం భూపాలపల్లి మండలంలోని గొర్ల వీడుగ్రామంలో నిర్వహించిన రెవెన్యూసదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూ రికార్డులో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు,వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బిలో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సం బంధించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ అంజలి రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రామస్వామి, హజారుద్దీన్, సర్వేయర్ శ్రీనివాస రావు, అసిస్టెంట్ సర్వేయర్ శివ, జూనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మి, టైపిస్ట్ రాజు,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -



