Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుఆర్టీసీ బస్‌పాస్‌ రేట్లు పెంపు

ఆర్టీసీ బస్‌పాస్‌ రేట్లు పెంపు

- Advertisement -

20 నుంచి 50 శాతం వరకు పెరుగుదల
స్టూడెంట్‌, జనరల్‌ బస్‌పాస్‌లు కూడా..
టోల్‌ చార్జీలూ సవరణ
ఈనెల 9 నుంచే అమల్లోకి..
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) బస్‌పాస్‌ ఛార్జీలను పెంచింది. టోల్‌ చార్జీలూ సవరించారు. సాధారణ ప్రజలతో పాటు, స్టూడెంట్‌ పాస్‌ ధరలను పెంచింది. తక్షణం పెరిగిన బస్‌పాస్‌ ఛార్జీలు అమల్లోకి వస్తాయని యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల బస్‌పాసులపై 20 శాతానికి పైగా రేట్లను పెంచారు. ప్రస్తుతం రూ.1,150 ఉన్న జనరల్‌ ఆర్డినరీ బస్‌పాస్‌ ధరను రూ.1,400కు (పెంపు 21.74 శాతం) పెంచారు. రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌ పాస్‌ ధరను రూ.1,600కు (23.08 శాతం) పెంచారు. రూ.1,450 ఉన్న మెట్రో డీలక్స్‌ పాస్‌ను రూ.1,800కు పెంచారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, గ్రీన్‌ మెట్రో ఏసీ పాస్‌ ధరలను కూడా భారీగా పెంచేశారు. ఎన్జీవోలు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఇచ్చే బస్‌పాస్‌ ధరలు కూడా పెరిగాయి. పుష్పక్‌ ఏసీ బస్‌పాస్‌ రేటు మాత్రం పెరగలేదు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad