నవతెలంగాణ-హైదరాబాద్: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటనపై విచారణను కర్ణాటక హైకోర్టు ఈ నెల 12కి వాయిదా వేసింది. సీల్డ్ కవర్‌లో సమాధానం దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ (ఎజి) శశికిరణ్ శెట్టిని కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన జడ్జి వి.కామేశ్వర్ రావు, జడ్జి సి.ఎం.జోషి సుమోటోగా విచారించారు. మంగళవారం విచారణ సందర్భంగా ఈ ఘటనపై సమాధానం దాఖలు చేయలేదని విచారణ సమయంలో ఎజి కోర్టుకు తెలిపారు.విచారణ కోసం జ్యుడీషియల్ కమిటీని నియమించామని, ఒక నెలలోగా రిపోర్ట్ సమర్పించాల్సిందిగా ఆదేశించామని అన్నారు. పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
జూన్4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సిబి నిర్వహించిన పరేడ్ తొక్కిసలాటలో 11మంది మరణించిన సంగతి తెలిసిసందే. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కర్ణాటక హైకోర్టు .. నివేదికను దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.