Tuesday, June 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంస్కూల్‌లో కాల్పులు.. 8 మంది మృతి

స్కూల్‌లో కాల్పులు.. 8 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆస్ట్రియాలోని గ్రాజ్ సిటీలో ఉన్న లెండ్ ప్రాంతంలోని స్కూల్‌లో షూటింగ్ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఆ కాల్పుల్లో ఎనిమిది మంది మృతిచెందారు. షూటింగ్ ఘ‌ట‌న‌కు ధీటుగా పోలీసులు స్పందిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు. బాధితుల ప‌ట్ల సానుభూతి వ్య‌క్తం చేశారు. కాల్పుల్లో అనేక మంది గాయ‌ప‌డ్డారు. దీంట్లో విద్యార్థులు, టీచ‌ర్లు ఉన్న‌ట్లు కూడా తెలిసింది. ఓ వీధిలో పోలీసులు సెర్చ్ ఆప‌రేష‌న్ మొద‌లు పెట్టారు. ఆ ప్రాంతంలో సెకండ‌రీ స్కూల్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. అధికారులు దీనిపై పూర్తి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -