Monday, September 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు..ఇద్దరి మృతి

ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు..ఇద్దరి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి వద్ద ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు లారీ కింద ఇరుక్కుపోవడంతో మహిళతో సహా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు, క్షతగాత్రులను మణుగూరుకు చెందిన వారిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -