Monday, August 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఈ ఏడాది కుంభవర్షాలు కురుస్తాయి: స్వర్ణలత

ఈ ఏడాది కుంభవర్షాలు కురుస్తాయి: స్వర్ణలత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అత్యంత పవిత్రమైన ‘రంగం’ కార్యక్రమం శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. ఉజ్జయిని అమ్మవారి భక్తురాలైన మాతంగి స్వర్ణలత పచ్చి మట్టి కుండపై నిలబడి అమ్మవారిని తనలోకి ఆవహించుకుని భవిష్యవాణి వినిపించారు. ‘నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాటిచ్చి ఇప్పటి నిలబెట్టుకోలేదు. అయినా ప్రజల్ని నేను కాపాడుతూనే ఉన్నా. ఏ ఆపద వచ్చినా.. ప్రమాదం వచ్చినా కాపాడుతున్నా. అయినా నా మాట మీరు ఆచరించటం లేదు. ఇది నాకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఎవరు అడ్డుపుల్ల వేసినా నేను ఊరుకోను. ఈ ఏడాది కూడా కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి. జనాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది అగ్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. జనాలు మాత్రం సగానికి సగం కొట్టుకుపోతునే ఉంటారు. ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏడాది అది జరుగుతూ ఉంటది. ఈ ఏడాది ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -