Tuesday, June 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅమెరికాలో 30 మంది భారతీయులు అరెస్టు

అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్టు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలో అక్ర‌మంగా జీవిస్తూ క‌మ‌ర్షియ‌ల్ ట్ర‌క్కు డ్రైవ‌ర్లుగా ప‌నిచేస్తున్న సుమారు 30 మంది భార‌తీయుల‌ను అరెస్టు చేశారు. ఫెడ‌రల్ ఆప‌రేష‌న్‌లో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ట్ర‌క్కు డ్రైవ‌ర్ల‌ను త్వ‌ర‌లో డిపోర్టు చేయ‌నున్నారు. అమెరికా క‌స్ట‌మ్స్ అండ్ బోర్డ‌ర్ ప్రొటెక్ష‌న్ శాఖ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. మే 11 నుంచి 15వ తేదీ మ‌ధ్య జ‌రిగిన ఆప‌రేష‌న్ చెక్‌మేట్‌లో భాగంగా అక్ర‌మ డ్రైవ‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం చెప్పింది. ఆరిజోనాలోని యుమా సెక్టార్‌లో ఉన్న బోర్డ‌ర్ పెట్రోలింగ్ ఏజెంట్లు ఆ డ్రైవ‌ర్ల‌ను అరెస్టు చేశారు. మొత్తం 52 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో 36 మందిని సెమీ ట్ర‌క్కు డ్రైవ‌ర్లుగా గుర్తించారు. వారిలో 30 మంది భార‌తీయులుగా తేల్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -