నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని కౌలాస్ గ్రామంలో మంగళవారం ఎంపీఓ రాము ఆధ్వర్యంలో డ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమం, పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఎంపీఓ పరిశీలించారు. అనంతరం గ్రామంలోని విధుల గుండా తిరిగి క్షేత్రస్థాయి పరిశీలన చేసారు. పారిశుధ్య లోపం ఉన్నటువంటి ప్రదేశంలో శుభ్రం చేయించారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కొనసాగుతున్నందుకు గ్రామంలో దోమల బెడద వలన వచ్చే రోగాలకు ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. నీరు నిలిచే గుంతలలో, మురికి కాల్వలో నీరు నిలిచే చోట ఆయిల్ బాల్స్ ను వేయడం జరిగింది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామంలో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లతో కలిసి గ్రామంలో పర్యటించారు. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? లేదో ? చూడడానికి ఇంటింటికి తిరిగి వివరాలను సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓతో పాటు ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, సఫాయి కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
కౌలాస్ గ్రామంలో చకచకా సాగిన డ్రై డే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES