Tuesday, June 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో కాల్పులు.. ఏడుగురి మృతి

అమెరికాలో కాల్పులు.. ఏడుగురి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలోని అయోవా రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులపై కాల్పులకు తెగబడ్డాడు. ఆరుగురిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో నిందితుడు సహా మొత్తం ఏడుగురు మరణించారు. మస్కటీన్ నగరంలో సోమవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. మస్కటీన్‌లోని పార్క్ అవెన్యూలో ఉన్న ఓ ఇంట్లో కాల్పులు జరుగుతున్నాయని సోమవారం మధ్యాహ్నం 12:12 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఇంట్లో తుపాకీ గాయాలతో పడి ఉన్న నలుగురిని గుర్తించారు. వారు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఈ దారుణానికి పాల్పడింది మస్కటీన్‌కు చెందిన 52 ఏళ్ల ర్యాన్ విల్లీస్ మెక్‌ఫార్లాండ్‌గా పోలీసులు గుర్తించారు. అతడు అక్కడి నుంచి పరారైనట్లు తెలుసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మిస్సిసిపీ నది వెంబడి ఉన్న ఓ రివర్‌ఫ్రంట్ ట్రయిల్‌లో అతడిని గుర్తించారు. పోలీసులు అతడితో మాట్లాడుతుండగానే మెక్‌ఫార్లాండ్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, అత్యవసర సిబ్బంది ప్రయత్నించినప్పటికీ అతడిని కాపాడలేకపోయారు. దర్యాప్తు కొనసాగిస్తున్న క్రమంలో పోలీసులకు మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మిల్ స్ట్రీట్‌లోని నివాసంలో ఒకరు, గ్రాండ్‌వ్యూ అవెన్యూలోని ఓ వ్యాపార సంస్థలో మరొకరు తుపాకీ గాయాలతో చనిపోయి ఉన్నారు. ప్రాథమిక విచారణలో మృతులందరూ నిందితుడు మెక్‌ఫార్లాండ్ కుటుంబ సభ్యులేనని, కుటుంబ తగాదాల కారణంగానే ఈ ఘోరం జరిగిందని తేలింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -