Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుశ్రీనుబాబు సేవలను కాంగ్రెస్ గుర్తించడం హర్షణీయం.!

శ్రీనుబాబు సేవలను కాంగ్రెస్ గుర్తించడం హర్షణీయం.!

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షుడు దండు రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు
: రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు సేవలను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా దుద్దిళ్ల శ్రీను బాబును నియామించడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు దండు రమేష్ మంగళవారం ఒకప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్లుగా క్రియాశీలకంగ పనిచేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిళ్ల శ్రీపాదరావు చిన్న కొడుకుగా,రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడిగా తండ్రి ఆశయసాధనలో, అన్న అడుగు జాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ  కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అన్నకు వెన్నంటి ఉంటూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటూ మంచి యూత్ నేత (యూత్ ఐకాన్) గా మంచి పేరు తెచ్చుకున్నారు.

నిత్యం వందలాది వివాహాలు, పరామర్శలతో పాటు మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ అన్నా అంటే నేను ఉన్న అనేలా  అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక్క మంథని నియోజకవర్గంలోనే కాకుండా అనేక నియోజకవర్గాల్లో కూడా అనేక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటు యువతలో ఉత్సహం నింపుతూ తండ్రికి తగ్గ తనయుడుగా, అన్నకు తగ్గ తమ్ముడుగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. శ్రీనుబాబు తెలంగాణ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad