Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రేషన్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

రేషన్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

- Advertisement -

జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
: నిత్యావసర వస్తువుల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం కాటారం మండలం లోని గారెపల్లి, ధన్వాడ గ్రామాల్లో చౌక ధరల దుకాణాలు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ స్టాక్ పరిశీలించి లబ్ధిదారులతో సంభాషించారు. చౌక ధరల దుకాణాలు సమర్థవంతంగా పనిచేయాలని  లబ్ధిదారులు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువుల పంపిణీ జరగాలని ఆయన ఆదేశించారు. లబ్ధిదారులు లేవనెత్తిన ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. చౌక దుకాణాల పనితీరును పర్యవేక్షించడం, పిడీఎస్ ప్రయోజనాలు పారదర్శకంగా, సమర్థవంతంగా ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరేలా చూడటం కోసం నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad