Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్నిజామాబాద్ లో యువకుడి దారుణ హత్య 

నిజామాబాద్ లో యువకుడి దారుణ హత్య 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్  : నగర శివారులోని హైదరాబాద్ రోడ్ లో గల పాంగ్రా వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. సుమారు 30 సంవత్సరాల వయస్సు గల యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు ముఖంపై బలమైన ఆయుధంతో కొట్టి హత్య చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారంతో నగర పోలీసులు అక్కడ చేరుకొని దర్యాప్తు చేపట్టారు. యువకుడి వివరాలు తెలిస్తే గాని హత్యకు గల కారణాలు తెలిసే అవకాశం లేదని పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని నిజామాబాద్ నగర సీఐ శ్రీనివాసరాజు, 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ లు పరిశీలించారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పాంగ్ర వద్ద గల కల్లుబట్టిలో సోమవారం రాత్రి ఏమైనా గొడవ జరిగి ఉంటుందా అని ఆరా తీస్తున్నారు. రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేసి ఉంటారని ఎస్ఎస్ శ్రీకాంత్ భావిస్తున్నారు. మృతుడి కుడి చేతిలో పులి బొమ్మ పచ్చబొట్టు ఉంది. కావున ఫోటోలోని వ్యక్తిని పచ్చబొట్టును గుర్తిస్తే సంబంధిత నాలుగవ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ లకు 8712659840, 8712659719,8712659836 సమాచారం అందించాలన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad