- Advertisement -
నవతెలంగాణ – హైదరాదబాద్: సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన తెలంగాణ అభ్యర్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్రానికి చెందిన పలువురు యువతీ యువకులు అత్యున్నత ర్యాంకులు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, 11వ ర్యాంకు సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటిన వరంగల్‌కు చెందిన ఎట్టబోయిన సాయి శివానికి కేటీఆర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె విజయం నారీశక్తికి నిదర్శనమని, యావత్ తెలంగాణకే గర్వకారణమని ఆయన కొనియాడారు.