Thursday, July 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమహోద్యమంలా వనమహోత్సవం

మహోద్యమంలా వనమహోత్సవం

- Advertisement -

రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
పీసీసీఎఫ్‌ డాక్టర్‌ సువర్ణతో కలిసి వన మహోత్సవం 2025 పోస్టరు ఆవిష్కరించిన మంత్రి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న వనమహోత్సవం కార్యక్రమాన్ని మహోద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని అటవీ అధికారులను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. వృక్షో రక్షిత రక్షిత్ణ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పునరుద్ఘాటించారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో వన మహోత్సవం-2025 పోస్టర్‌ను తెలంగాణ అటవీ ప్రధాన సంరక్షణ అధికారి(పీసీసీఎఫ్‌) డాక్టర్‌ సువర్ణ, పీసీఎఫ్‌లు ప్రియాంక వర్గీస్‌, రామలింగంతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ… ఈ ఏడాది తలపెట్టబోయే వనమహౌత్సవ కార్యక్రమం వంద శాతం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. అన్నివర్గాల వారు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. నాటిన ప్రతి మొక్కనూ బతికించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. పండ్ల మొక్కలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జిల్లాల్లో జూన్‌, జూలై, ఆగస్టు మాసాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. 2024లో రాష్ట్రవ్యాప్తంగా 20.02 కోట్ల మొక్కలు నాటాలని ప్రణాళికలు వేసుకోగా…95 శాతం లక్ష్యాన్నే పూర్తి చేశారని గుర్తుచేశారు. ఈ సారి వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని దిశానిర్దేశం చేశారు.. ప్రతి గ్రామంలోనూ వన నర్సరీల ద్వారా మొక్కలు పెంచి అదే గ్రామంలో నాటించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి ఇంటికీ మొక్కలిచ్చి నాటేందుకు ప్రోత్సహించాలని చెప్పారు. ప్రజలు అడిగిన మొక్కలను అందజేయడానికి అధికారులు సిద్దంగా ఉండాలన్నారు. ఇండ్లలో ప్రధానంగా పెంచే గులాబీ, మందార, సీతాఫలం, జామ, ఉసిరి, అల్ల నేరేడు, మునగ, కానుగ, తులసి, ఈత మొక్కలతో పాటు పలు ఔషద మొక్కలు, పూల మొక్కలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువు గట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, వైద్య శాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల ఆవరణల్లో పూల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గతం కంటే ఈసారి నైరుతి రుతుపవనాలు ముందే వచ్చిన నేపథ్యంలో అందరూ సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ఈ దఫా వనమహౌత్సవంలో ఈత, తాటి, వేప, చింత, కుంకుడు మొక్కలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటిన వారికి గుర్తించి ప్రోత్సాహకాలివ్వాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -