Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్బాల కార్మికులతో పని చేయిస్తే చర్యలు తప్పవు...   

బాల కార్మికులతో పని చేయిస్తే చర్యలు తప్పవు…   

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్
బాల కార్మికులతో పనిచేయిస్తే చర్యలు తప్పవని జిల్లా న్యాయమూర్తి రాధిక అన్నారు. మండలంలోని తరోడ గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గురువారం న్యాయ సేవా సమితి,సీనియర్ సిటిజన్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు  ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బడి ఈడుపిల్లలందరినీ బడికి పంపాలని అన్నారు‌.  ఎట్టి పరిస్థితుల్లో బాలలను పనిలో పెట్టుకోకూడదని సూచించారు . బాల కార్మికుల ను పనిలో పెట్టిన వారికి,పనిలో ఉంచిన వారికి చర్యలు తప్పవని అన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలను విధిగా పాఠ శాలలకు పంపాలని పేర్కొన్నారు. అలాగే బాల్య వివాలను నిర్మూలించాలని సూచించారు. ఎవరు కూడా బాల్యవివాహాలను, ప్రోత్సహించకూడదని అన్నారు. అలా చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని పేర్కొన్నారు. వాటిపై ప్రత్యేక కమిటీ పర్యవేక్షిస్తుందని అన్నారు .ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయాలని అన్నారు .ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు సమ దుస్తులు పంపిణిచేశారు.  అనంతరం మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఎస్సై బిట్ల పెర్సెస్ ,సిడిపివో సరోజిని ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad