Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలురాత్రి వరకు సాగిన రెవెన్యూ సదస్సు..

రాత్రి వరకు సాగిన రెవెన్యూ సదస్సు..

- Advertisement -

-పోటేత్తిన రైతులు..అధిక సంఖ్యలో దరఖాస్తులు

-రాత్రి 8 గం.వరకు దరఖాస్తుల స్వీకరణ

నవతెలంగాణ-బెజ్జంకి

మండల కేంద్రంలోని రైతు వేదిక యందు ఏర్పాటుచేసిన భూ భారతి రెవెన్యూ సదస్సు శుక్రవారం రాత్రి సమయం వరకు కొనసాగింది.రైతులు తమ భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించడానికి ఉదయం 9 గం నుండి రైతు వేదిక అవరణం వద్ద దరఖాస్తులు సమర్పించడానికి పొటేత్తారు.రాత్రి 8 గంటల వరకు కొనసాగిన రెవెన్యూ సదస్సులో రైతుల భూ సమస్యల దరఖాస్తులను అధికారులు స్వీకరించారు.దరఖాస్తుల సమర్పణలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు వ్యవహరించారు.సుమారు 211 మంది రైతులు తమ భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించినట్టు అధికారులు తెలిపారు.ఆర్ఐ సంతోష్,రెవెన్యూ సిబ్బంది స్వామి,రజిత,వనిత,రమేశ్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad