అమ్మకు గుండెపోటుతో తిరుగు పయనం
న్యూఢిల్లీ : ఇంగాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ గౌతం గంభీర్ గురువారం హుటాహుటిన స్వదేశం చేరుకున్నారు!. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ ముంగిట భారత్-ఏతో భారత్ గురువారం నుంచి నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతుండగా.. బుధవారమే గౌతం గంభీర్ లండన్ నుంచి న్యూఢిల్లీకి బయల్దేరినట్టు సమాచారం. గౌతం గంభీర్ గైర్హాజరీలో సహాయక కోచ్‌లు సితాన్షు కోటక్, రియాన్, మోర్నె మోర్కెల్‌లు శుభ్‌మన్ గిల్ సేన శిక్షణ బాధ్యతలను తీసుకోనున్నారు. మరోవైపు భారత్-ఏ జట్టుకు హృతికేశ్ ఇన్‌చార్జీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారత్-ఏ, భారత్ ఫస్ట్‌క్లాస్ టూర్ గేమ్ పూర్తిగా అంతర్గత మ్యాచ్‌గా సాగుతోంది. అభిమానులకు ప్రవేశం కల్పించలేదని తెలుస్తోంది.
గంభీర్ అమ్మకు గుండెపోటు : మరో ఆరు రోజుల్లో భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్టు ఆరంభం కానుంది. భారత్-ఏతో గిల్ సేన నాలుగు వార్మప్ మ్యాచ్‌లో ఆడుతోంది. ఈ పరిస్థితుల్లో గౌతం గంభీర్ స్వదేశానికి చేరుకున్నాడు. కుటుంబ కారణాలతో భారత్‌కు తిరిగి వచ్చినట్టు చెప్పినా.. గంభీర్ తల్లి సీమ గంభీర్ బుధవారం గుండెపోటుకు గురైనట్టు తెలుస్తోంది. న్యూఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్‌లో సీమ గంభీర్‌కు ఇంటెన్సివ్ కేర్ (ఐసీయు) చికిత్స అందిస్తున్నారు. లండన్ నుంచి న్యూఢిల్లీకి చేరుకున్న గంభీర్ నేరుగా ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. సీమ గంభీర్ ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదు.
స్వదేశానికి గంభీర్
- Advertisement -
- Advertisement -