Sunday, July 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

- Advertisement -

– 16న విచారణకు రావాలని వెల్లడి
– సహకరిస్తా..లైడిటెక్టర్‌ పరీక్షకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమా? : కేటీఆర్‌ సవాల్‌
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

ఫార్ములా-ఈ రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని వివరించింది. గతనెల 26న విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చిన విషయం విదితమే. అయితే, తనకు ముందుకు నిర్దేశించిన ప్రకారం విదేశీ పర్యటన ఉన్నదనీ, తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతానని అప్పటి నోటీసులకు కేటీఆర్‌ సమాధానం కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చింది. దీంతో తాజా పరిణామం రాజకీయంగా ఆసక్తిగా మారింది. ఇటు ఏసీబీ నోటీసుల నేపథ్యంలో కేటీఆర్‌ స్పందించారు. బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు హాజరవుతానని చెప్పారు. ఈ కేసులో 16న ఏసీబీ విచారణకు సహకరిస్తానని తెలిపారు. పాలన చేతగాకనే, ప్రజల దృష్టిని మళ్లించటానికి ఇలాంటి చర్యలని ఆయన అన్నారు. ”ఓటుకు నోటు కేసులో సీఎంను కూడా ఏసీబీ విచారిస్తోంది. ఇద్దరమూ ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నాం. లైడిటెక్టర్‌ పరీక్షలకు నేను సిద్ధం. మీరు సిద్ధమా” అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి సవాలు విసిరారు. జడ్జి సమక్షంలో ఇద్దరం లైడిటెక్టర్‌ పరీక్షలు చేయించుకొని, టీవీల్లో లైవ్‌గా చూపిద్దామన్నారు. ఈ పరీక్షలు చూసి నేరస్థులు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారని కేటీఆర్‌ చెప్పారు. తనతో పాటు లై డిటెక్టర్‌ పరీక్షలు చేయించుకునే ధైర్యం ఉన్నదా? అని సవాల్‌ విసిరారు. ప్రతీసారి విచారణలతో ప్రజా ధనం వృథా చేయటమెందుకని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -