Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కేవీపీఎస్ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి..

కేవీపీఎస్ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి..

- Advertisement -

జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను
నవతెలంగాణ – పెద్దవూర
ఈ నెల 22,23న కట్టంగూర్ మండల కేంద్రంలో జరిగే కేవీపీస్ జిల్లా స్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కేవీపీఎస్జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో శిక్షణా తరగతుల కరపత్రాలను ఆవిష్కరణ చేసి మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా నేడు దళిత గిరిజనుల అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. వీరి హక్కుల సాధనకై నిరంతర పోరాటం తప్ప ఏ మార్గం లేదని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రధానంగా దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులను అత్యాచారాలను హత్యలను వ్యతిరేకిస్తూన్నామని తెలిపారు. అంటరానితనం కుల వివక్షను అంతం చేసి అంతిమంగా కుల నిర్మూలన లక్ష్యంతో కేవీపీఎస్ పనిచేస్తుందని అన్నారు దళితులు ఆత్మగౌరవంతో బతకాలని, కెవిపిఎస్ రాజులేని పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 22,23 తేదీలలో కట్టంగూర్ మండల కేంద్రంలో జరిగే కెవిపిఎస్ నల్లగొండ జిల్లా స్థాయి శిక్షణ తరగతులకు దళితులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు దొంతాల నాగార్జున, దొరపల్లి మల్లయ్య, దుబ్బా పరమేష్, చుక్కా రమేష్, తరి రామకృష్ణ, ఊరే ప్రభాకర్, ఈదయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad