Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ పనులపై రైతు సంతృప్తి..

ఉపాధి హామీ పనులపై రైతు సంతృప్తి..

- Advertisement -
  • అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన రైతు బొడ్డు లింగయ్య..
    నవతెలంగాణ – పెద్దవూర
    మండల పరిధిలో ఉన్న రైతుబొడ్డు లింగయ్య పొలంలో కంప చెట్లు, చిన్నచిన్న బండరాళ్లు వుండిపోయి వ్యవసాయానికి ఇబ్బందిగా మారింది. దాంతో ఉపాధి హామీ పనులలో భాగంగా పనులు పనులు చేపట్టి అతి తక్కువ కాల వ్యవధిలో చెట్లను తొలగించి, మొద్దులను తీసి తనకు  తనపొలం సేద్యం చేసుకోవడానికి అందించిన ఉపాధి హామీ కూలీలకు, అధికారులకు  రైతు బోడ్డు లింగయ్య శనివారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ.. చెట్లు చేమలతో అడవిని తలవించేలా ఉన్న తన పొలంలో ఈసీ కొండయ్య, టెక్నికల్ అసిస్టెంట్ అంజయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ ఊర శ్రీను, మేటి శ్రీనివాసచారి ఆధ్వర్యంలో 50 మంది కూలీలతో రెండు వారాలపాటు ఉపాధి హామీ పనులు నిర్వహించి సాగు చేసుకోవడానికి అనుకూలంగా తన పొలాన్ని మార్చినందుకు రైతుకృతజ్ఞతలు తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో ఖరీఫ్ సీజన్ కు సేద్యం చేసుకోవడానికి రైతుకు పొలాన్ని అందించడంతో సదరు రైతు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కర్నాటి వెంకట్ రెడ్డి, రమేష్, జోగు కోటేష్, జోగు రాజు, కర్నాటి శ్రీరామ్ రెడ్డి, పళ్ళ జయపాల్ రెడ్డి, పుష్పలత, పద్మ, రాజేశ్వరి, సాంబయ్య, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. 
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad