నవతెలంగాణ – ఆర్మూర్: నందిపేట్ మండలం బజార్ కొత్తూర్ గ్రామానికి చెందిన ఆదివాసి నాయకపోడ్ కులానికి చెందిన 17 సంవత్సరాల బాలిక భవాని తల్లిదండ్రులు గంట లక్ష్మణ్, లక్ష్మీ ఒక సంవత్సరం వ్యవధిలో చనిపోవడం జరిగింది. బాలిక అనాధగా ఒంటరిగా మిగిలిపోయి వారి నాయనమ్మ వద్ద ఉంటుందని తెలిసి జిల్లా లో ఉన్న ఆదివాసి నాయకపోడ్ కులస్తులు కులానికి సంబంధించిన వాట్సప్ గ్రూపులలో చూసి నేను సైతం నాయకపోడ్ చేయుతకై అనే వాట్సప్ గ్రూపులో చూసి వారికి తోచిన సహాయం ఫోన్ పే, గూగుల్ పే ద్వారా సుమారు రూ.39000/- వెయ్యిల రూపాయలు (39 వెయ్యిలు) ఒక నెలకు సరిపోయే నిత్యవసర సరుకులు శనివారం అందజేసినారు. ఆదివాసి నాయకపొడ్ జిల్లా అధ్యక్షుడు జిల్లా కేంద్రంలో ఉన్న విజయలక్ష్మి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బండారి భోజన్న వ్యక్తిగతంగా తన వంతుగా 50 వెయ్యిల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్టి మొత్తం డబ్బుల నుండి 75 వేల రూపాయలు బాలిక భవాని పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది, మిగతా డబ్బులు నిత్యవసర జీవనోపాధి ఖర్చుల గురించి బాలిక భవానికి రూ.14000 వేల ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదివాసి నాయకపోడ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారి భోజన్న, జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ లోలం గంగాధర్, ఉద్యోగుల సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కోండ్రు నవీన్, జిల్లా ఉపాధ్యక్షురాలు, కులస్పూర్ పి జీ హెచ్ఎం, జిల్లా మాజీ జి సి డి ఓ సింగం వనిత, నందిపేట మండలం అధ్యక్షుడు మన్నే సాగర్, డొంకేశ్వర్ మండల అధ్యక్షుడు , దుంపల శ్రీనివాస్, ఆర్మూర్ మండల ప్రధాన కార్యదర్శి మేడిపల్లి గౌతం, జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్ తదితరు లు పాల్గొన్నారు.
అనాద బాలికకు ఆర్థిక సాయం అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES