- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప చిత్రం జూన్ 27న విడుదల కానుండగా, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చారిత్రక చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్రతారలు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
- Advertisement -