న్యూయార్క్ : దిగ్గజ టెక్ కంపెనీ ఇంటెల్ వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందని రిపోర్టులు వస్తోన్నాయి. తమ సిబ్బందిలో దాదాపు 20 శాతానికి పైగా కోత పెట్టాలని యోచిస్తోందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ చేసింది. గత మార్చిలో నూతన సిఇఒగా నియమితులైన లిప్ బు తాన్ నేతృత్వంలో 20,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను ప్రకటించనుందని వెల్లడించింది. 2024లో 19 బిలియన్ డాలర్ల నష్టాలను ఎదుర్కొన్న నేపథ్యంలో పొదుపు చర్యలపై దృష్టి పెడుతోందని సమాచారం. ఇంతక్రితం 2024 ఆగస్టులో 15,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. దీంతో కంపెనీ మొత్తం సంఖ్య 1,08,900కు చేరింది. ఇంతక్రితం 2023లో ఇంటెల్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 124,800 ఉండేది.
- Advertisement -