Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇద్దరమ్మ ఇండ్ల అక్రమాలను అరికట్టాలి

ఇద్దరమ్మ ఇండ్ల అక్రమాలను అరికట్టాలి

- Advertisement -

జడ్పీ చైర్పర్సన్ బడే నాగ జ్యోతి 
నార్లాపూర్ లో లబ్ధిదారులతో ర్యాలీ, ధర్నా 
నవతెలంగాణ – తాడ్వాయి 
: ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామంలో ఆదివారం బిఆర్ఎస్ ములుగు జిల్లా నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జెడ్పి చైర్ పర్సన్ బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రేస్ సర్కార్ అమలు చేసిన పథకాల పై ప్రజల పక్షాన నిలబడి భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రేస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఇటీవల కాలంలొ  అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్ళ జాబితాలో పూర్తిగా అనర్హులకే కెటాయించారని, నాగజ్యోతి మండిపడ్డారు. అసలైన లబ్దీదారులను జాబితాలో చేర్చకుండా కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డబ్బులు చెల్లించిన వారికే కట్టాపెట్టారని అధికారులు ప్రక్షాలన చేయాలని నాగజ్యోతి డిమాండ్ చేశారు.

కాంగ్రేస్ ప్రభుత్వం అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్ళ పథకం గ్రామాలలో నిరుపేదలకు అందించకుండా అనర్హులకే అందించారని కాంగ్రేస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లను మభ్యపెట్టి పథకాలలో అవకతవకలకు పాల్పడుతున్నారని జిల్లా బీఆరెస్ పార్టీ నాయకులు గోవింద్ నాయక్, రామసహాయం శ్రీనివాసరెడ్డీలు కాంగ్రేస్ పాలన పై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు ఎన్నికల అసిస్టెంట్గా విడుదల చేసి ప్రజలను మభ్యపెడితే ఊరుకునేది లేదని అన్నారు.

అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందించకుండా ఎన్నికల స్టంట్ గా విడుదల చేసి ప్రజలను మభ్య పెడితే ఊరుకునేది లేదని ప్రభుత్వ పథకాలు అర్హులకు చెందకుంటే ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దండగల మల్లయ్య, మాజీ ఎంపిటిసి కుక్కల శ్రీను, మాజీ సర్పంచ్లు గొంది శ్రీధర్, శివరాజ్, గుర్రం రామ సమ్మి రెడ్డి, మేడారం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ కాక లింగయ్య, అజ్మీర రతన్, మొక్క భాస్కర్ జీడి బాబు గోపాలపురం సతీష్, సుభాష్ రెడ్డి పత్తి గోపాల్ రెడ్డి కొమురయ్య ఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad