నవతెలంగాణ – హైదరాబాద్: పహల్‌గామ్ ఉగ్రదాడి తరహాలో మరోసారి తీవ్రవాదులు హిమాచల్‌ప్రదేశ్‌లో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పోలీస్ శాఖను ఆదేశించారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌తో బార్డర్‌ను పంచుకునే చంబా, కంగ్రా జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు.
- Advertisement -