Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్37 నియోజకవర్గాల్లో జెండావిష్కరణలు..

37 నియోజకవర్గాల్లో జెండావిష్కరణలు..

- Advertisement -

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: తెలంగాణ వ్యాప్తంగా 37 నియోజకవర్గాలలోని 135 గ్రామాలలో జెండా ఆవిష్కరణలు చేశామని మాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోద మల్లికార్జున్ గౌడ్ వ్యవస్థాపక సభ్యులు వడ్డేపల్లి దశరథ్ సాగర్ అన్నారు. ఆదివారం నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లి, కొయ్యలగూడెం గ్రామం తోపాటు చండూరు, పలివెల,గట్టుప్పల్,పుట్టపాక, నారాయణపురం గ్రామాలలో పాల్గొన్న MASS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోద మల్లికార్జున్ గౌడ్ వ్యవస్థాపక సభ్యులు వడ్డేపల్లి దశరథ్ సాగర్ లు మాస్ వ్యవస్థాపకులు నర్సింగ్ రావు పిలుపుమేరకు ఒకే రోజు 135 గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, నియోజకవర్గ కేంద్రాలలో, జెండాలు ఆవిష్కరించడం జరిగింది. బీసీ కులాల్లో చైతన్యం, సఖ్యత, కోసం గత నెల రోజులుగా గ్రామ బాట కార్యక్రమంని చేపడుతూ గ్రామాలలో ఉన్న బీసీలను (కులవృత్తుల చేసుకునే కులాలను) వారి మధ్య సఖ్యతను మరియు రాజకీయ చైతన్యాన్ని నింపుతూ గ్రామ బాట కార్యక్రమం కొనసాగిస్తూ ఈరోజు (జూన్ 15) ఒకే రోజు 135 గ్రామాలలో, వేడుకలగా మన ఆలోచన సాధన సమితి రాష్ట్ర కమిటీ సభ్యులతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, నియోజకవర్గ కేంద్రాలలో జెండాను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వేడుకలలో చీకురి వెంకటేష్ గౌడ్, సురేష్ గౌడ్, రఘురాం నేత, జిట్టా జనార్ధన్, జిట్టా శ్రీనివాస్ యాదవ్, మునుకుంట్ల శివకుమార్ గౌడ్, అంతటి కుమార్ గౌడ్, చెరుకు శివ గౌడ్, గోద లింగస్వామి గౌడ్, రావుల మల్లేష్, కొయ్యడ వంశీ తదితరులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad