Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజప్రశ్నించే సాధికారత ఉన్న కథలు

ప్రశ్నించే సాధికారత ఉన్న కథలు

- Advertisement -

నేను ఎం.ఏ చదివే రోజుల్లో సాహిత్యం పట్ల ఆసక్తి ఏర్పడింది. అప్పుడప్పుడే కథల వైపు నా మనసు మళ్ళింది. దానికి గల ప్రధాన కారణం స్త్రీకి సంబంధించిన అంశాన్ని తీసుకుని ప్రాజెక్టు వైవాలో భాగంగా ఉపన్యసించడమే. అప్పుడే నా మనసు స్త్రీల సమస్యలవైపు ఆలోచించేలా చేసింది. అలాంటి కథలు చదువుతున్నప్పుడు పుస్తకం పక్కకు పెట్టాలనిపించదు.
విభిన్నాంశాలకు సంబంధించిన కథలను కథలుగా వింటాం. చెప్పేటప్పుడు,రాసేటప్పుడు, రాసిన కథలను చదివేటప్పుడు ఆ కథావస్తువు విభిన్న కోణాల్లో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ ప్రయాణంలో కథల గురించి లోతుగా తెలుసుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని పుస్తకాలను గాలిస్తూ ఉంటాం. గాలిస్తూ ఉన్న క్రమంలో అన్ని రకాల పుస్తకాలు మనకు అందుబాటులో ఉండవు. ఆ పుస్తకం కోసం ప్రయత్నించే క్రమంలో నచ్చిన పుస్తకాలు దొరికితే ఆ సంతోషమే వేరు. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు పుస్తకం దొరికిందనే సంతోషంలో కడుపు నిండా తినకుండానే బుక్‌స్టాల్‌కి బయలు దేరేలా నన్ను ప్రేరేపించందంటే ఆ పుస్తకం గొప్పదవుతుంది. ఆ పుస్తకమే బి. అనురాధ సంపాదకత్వంలో వెలువడిన ‘వియుక్క'(కథాసంకలనాలు).
అందులో మొదటి మూడు సంకలనాలు విప్లవవోద్యమం కథా వస్తువు. తరువాతి మూడు సంకలనాల్లో విభిన్న కథా వస్తువులతో పాటు అర్బన్‌ ఉద్యమానికి సంబంధించిన కథలు కూడా ఉన్నాయి.
సాధారణంగా పాఠకుడు కథల్ని చదివేటప్పుడు కథావస్తువుకు సంబంధించిన దష్టికోణం నిగూఢంగా ఆలోచించే తత్త్వానికి సంబంధించినవి అన్నీ ఉంటాయని చెప్పలేం. కొన్ని కథలు చదివేటప్పుడు మన నిజజీవితంలో సమస్యల పరిష్కారానికి దోహదపడతాయి. విప్లవమంటే కేవలం ఉద్యమాలు చేయడం, ఎదురు తిరగడం, కాల్పులు జరపడం..ఇలాంటి అంశాలే సాధారణ పాఠకుడి మెదళ్ళలో మెదులుతాయి. నిజ జీవితంలో విప్లవమంటే స్త్రీ ధైర్యంతో ముందుకు వెళ్ళడమనే అర్థాన్ని ఈ కథలు తెలియజేస్తాయి.
సమాజంలో స్త్రీ కొన్ని కట్టుబాట్ల మధ్య బతుకుతుంది. ప్రధానంగా స్త్రీ ఎదుర్కొనే సమస్యల్లో బాల్యవివాహాలు, నిరక్షరాస్యత, స్త్రీ పురుష వ్యత్యాసం, వరకట్న సమస్యలు, మాతత్వ సమస్యలు, గహహింస ప్రధానంగా కనిపిస్తాయి. సమస్యలకు పరిష్కార మార్గాన్ని అన్ని కథలు చూపలేవు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఎదురుతిరిగి ప్రశ్నించడాన్ని ఈ కథలు తెలియజేశాయి. సమాజాన్ని కొత్త దష్టితో చూసే పాఠకుడికి ఒక ఉత్సాహాన్నిస్తాయి.
ఇవి మనసు లోతుల్లో నుంచి వచ్చిన కథలు. ఉద్యమ గమనం, సజనాత్మకమైన చరిత్రను తెలియజేసే కథలివి. ఈ కథల్లో కనబడే మానవీయ విలువలకు నాకు చేతులెత్తి నమస్కారం చేయాలనిపించింది.
పి.జి. పూర్తయ్యాక పిహెచ్‌.డిలో చేరాను. పరిశోధనలో భాగంగా నేను తీసుకున్న అంశం ‘తెలంగాణ రచయిత్రుల కథాసాహిత్యం-స్త్రీ జీవిత చిత్రణ'(1991-2015) అధ్యయన విభజన పూర్తయ్యాక స్త్రీవాద, దళితవాద, మైనారిటీవాద, తెలంగాణ అస్తిత్వవాదాలకు సంబంధించిన కథలను సేకరించాను. కానీ విప్లవకోణంలో స్త్రీలకథలు సేకరించలేకపోయాననే బాధ వియుక్క కథాసంకలనాలతో తీరిపోయింది. నా పరిశోధనకు వియుక్క కథాసంకలనాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. నేను చదివిన పుస్తకాల్లో నాకు ఎంతో స్ఫూర్తి నిచ్చింది వియుక్క. ప్రతీ పాఠకుడు చదవాల్సిన కథలు ఇందులో ఉన్నాయి. పరిశోధకులకు ఈ పుస్తకం కరదీపికలా ఉపయోగపడుతుందని నేను నిస్సంకోచంగా చెప్పగలను.
– పెద్దపల్లి తేజస్వి, 9603329474

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad