సాహితీ వార్తలు

‘నానీ లోచనాలు’ ఆవిష్కరణ
శ్రీమతి గడ్డం సులోచన రచించిన ‘నానీ లోచనాలు’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఈ నెల 9నఉదయం 10 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. ఈ సభలో డా||ఎన్‌.గోపి, ఆచార్య సూర్యా ధనంజరు, డా|| ఉదారి నారాయణ, కుడికాల వంశీధర్‌, డా|| జి. ఆదినారాయణ పాల్గొంటారు. – కుడికాల వంశీధర్‌
ఫీచర సునీతా రావు పురస్కారాలు
ఫీచర సునీతారావు పురస్కారాలకు 2023 కు ఎన్నికైన వాళ్ల పేర్లను ప్రకటించింది. కవిత్వంలో ‘దీపముండగానే’ సంపుటం గజ్జల రామకష్ణకు, కథా రచనలో ‘ఉడుకు బెల్లం’ చింతకింది శ్రీనివాస్‌కు, విమర్శలో ‘షడ్చక్రం’ లక్ష్మణ చక్రవర్తి, ‘దిక్‌ చక్రం’ ఆడెపు లక్ష్మీపతికి, లభించాయి. ప్రతి విజేతకు 15000 నగదు జ్ఞాపికతో సత్కారం ఉంటుంది.
సాహితీ పురస్కారాలు – 2024
‘దశమ పుస్తక పురస్కారాలు’ లో భాగంగా శ్రీ మక్కెన రామ సుబ్బయ్య కధా పురస్కారం, ఆచార్య నెల్లుట్ల కవితా పురస్కారం, డా|| కె.వి.రావు కవితా ప్రక్రియ పురస్కారం, సాహితీ పురస్కారం, బాలసాహిత్య పురస్కారం, విజ్ఞాన/ మనోవైజ్ఞానిక పుస్తక పురస్కారం విభాగాలలో పురస్కారాలున్నాయి. అన్ని రాష్ట్రాల రచయితలు 2023 సం||లో ప్రచురించిన పుస్తకాలను పంపొచ్చు. రచయితలు పుస్తకాల మూడు ప్రతులను డా|| మక్కెన శ్రీను, అసోసియేట్‌ డీన్‌, కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌, గరివిడి, విజయనగరం జిల్లా-535 101, ఎ.పి. చిరునామాకు ఏప్రిల్‌ 8వ తేదీ లోపు పంపాలి.

Spread the love