నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రిక.
అనుదినం…జనస్వరం.
సాకారమైంది భౌగోళిక తెలంగాణ.
సాధించాల్సింది సమసమాజ తెలంగాణ.
కలలు, కన్నీళ్లు, రక్తంతో తడిసిన ఈ నేల తల్లడిల్లింది కేవలం పదిజిల్లాల తెలంగాణ కోసం మాత్రమే కాదు.
ఎలాంటి పీడనల్లేని, దుర్మార్గాలకు తావులేని తెలంగాణ రాష్ట్రం ప్రజల సుదీర్ఘ స్వప్నం.
ఈ స్వప్నసాకారం కోసం అంకితమై పనిచేయడం ‘నవతెలంగాణ’ లక్ష్యం.
తెలంగాణ నేలపై సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టడం ఈ పత్రిక ధ్యేయం.
సకల అంశాల సమాచారానికీ, వివిధ వర్గాల మనోభావాలకు నెలవు ‘నవతెలంగాణ’.
వార్తలు, విశ్లేషణలు, వినూత్న కథనాలు కొత్తకోణంలో అందించడం దీని ప్రత్యేకత.
నిజాల్ని నిర్భయంగా చెప్పడమే కాదు,
ఆ నిజాల వెనుక దాగిన లోగుట్టును బయటపెట్టడం ‘నవతెలంగాణ’ కర్తవ్యం.
తెర ముందు సంగతుల్నే కాదు, తెర వెనుక మంత్రాంగాలనూ తెలియజేస్తుంది.
వార్త అంటే కేవలం వార్త కాదు, ఆ వార్త వెనుక అసలు నేపథ్యమే సిసలైన వార్త.
ఇలాంటి అసలుసిసలు తనాన్ని అందిస్తూ ప్రజల అవగాహనకు పదును పెట్టడం తన విధిగా భావిస్తుంది.
ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉపకరించే జర్నలిజానికి బాటలు వేస్తుంది.
తిమ్మిని బమ్మినిచేసే వంచనా పూరిత రాజకీయాల అసలు రంగును తేటతెల్లం చేస్తుంది.
ప్రజా రాజకీయాల శక్తినీ, చైతన్యాన్నీ, సృజనాత్మకతనీ చాటుతుంది.
ఆర్థికం, వాణిజ్యం అస్పృశ్యం కాదు. మార్కెట్ మంత్ర తంత్రాలు నిషిద్ధం కాదు.
వాటిలోని ప్రజానుకూల పోకడల్ని చెబుతుంది.
అభివృద్ధి పేరిట ప్రజల శ్రమను కొల్లగొట్టే కుతంత్రాల్ని కప్పదాట్లు లేకుండా విశ్లేషిస్తుంది.
మార్కెట్ బలిమి కాదు ప్రజల మేలు తలపోయడం అక్షరానికి సార్థకత.
అలాంటి అక్షరాల జీవశక్తి ‘నవతెలంగాణ’.
ఇది తెలంగాణకు కొత్త ఒరవడి. కొత్త ఆశలు మోసులెత్తే ప్రజల జీవనాడి.
తెలంగాణ బతుకులోని సహజత్వం, శ్రమైక జీవన సౌందర్యం ‘నవతెలంగాణ’కు అలంకారం.
పల్లెల్లో, పట్టణాల్లో వేలు, లక్షలుగా పరివ్యాప్తమై వున్న ప్రజల ఆధునిక అవసరాల్ని తీర్చే వాహిక.
అనేక అస్తిత్వాల పరివేదనని వినిపించే వేదిక.
తెలంగాణ ప్రాంతీయ నిర్దిష్టతల్లోంచి లోకం పోకడల్ని గమనిస్తుంది.
మరుగున పడిన చరిత్రను వెలికితీస్తుంది.
ఇక్కడి నేల, ఇక్కడి భాష, ఇక్కడి సంస్కృతి, ఇక్కడి సాహిత్యం ‘నవతెలంగాణ’కు శిరోధార్యం.
చదువులు, ఉద్యోగాలు, వంటలు, ఉత్సవాలు, పండగలు, పబ్బాలు… అన్నింటా తెలంగాణతనం ‘నవతెలంగాణ’ ప్రత్యేకం.
ఒక్కమాటలో చెప్పాలంటే ‘నవతెలంగాణ’ వేయి వెలుగుల సింగిడి!!