‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయ సందర్శన యాత్రలో భాగంగా గుంటూరులోని ‘అన్నమయ్య గ్రంథాలయ సందర్శన యాత్ర ఈ నెల 21వ తేది న నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ‘మన ఆంధ్రప్రదేశ్’ కవితా సంకలనాన్ని ప్రఖ్యాత కవి, విమర్శకులు డా|| పాపినేని శివశంకర్ ఆవిష్కరిస్తారు. డా. ఉప్పలధడియం వెంకటేశ్వర హైకూ సంపుటి ‘విత్తనం’ను ప్రముఖ కవి అడిగోపుల వెంకటరత్నం ఆవిష్కరిస్తారు. ఈ యాత్రను సందర్శించడానికి పాల్గొనదలచినవారు 9247475975 నెంబర్ కు సంప్రదించగలరు.
– చలపాక ప్రకాష్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం