ఢిల్లీ మద్యం కేసు: కవితకు బెయిల్‌ నిరాకరణ..

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ను నిరాకరిస్తూ రౌజ్‌ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. ప్రస్తుతం కవిత తిహాడ్‌ జైలులో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని అంతకు ముందుకు ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఈ వాదనను రౌస్ ఎవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఈడీ దాఖలు చేసిన కేసుతో పాటు లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ ఆరోపణలపై సీబీఐ దాఖలు చేసిన కేసులతో ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అంతకుముందు తనను ప్రత్యక్షంగా కోర్టులో హాజరు పరచాలంటూ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్ నూ కోర్టు తోసిపుచ్చింది.

Spread the love