ఢిల్లీ మద్యం కేసు: రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన కవిత

నవతెలంగాణ – ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ విచారణకు అనుమతివ్వడాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ వేశారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది నితీష్‌ రాణా కోర్టులో మెన్షన్‌ చేశారు. ఆమెను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోరారు. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు సీబీఐ సమయం కోరింది. దీంతో ఈ నెల 10 వరకు సమయం ఇచ్చినట్లు కోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 10న చేపట్టనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

Spread the love