Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుఅసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు..

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు..

- Advertisement -

కాటారం డీఎస్పీ సూర్యనారాయణ
నవతెలంగాణ – మల్హర్ రావు (కాటారం) :
యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని కాటారం డిఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు. కాటారం పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పోలీసులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉం డి. వారి సమస్యల పరి ష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు.కాటారం సబ్ డివిజన్లోని అన్ని గ్రామాలలో పర్యటించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానన్నారు. అలాగే శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత చెడు అలవాట్లకు బానిసగా మారి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు.తల్లిదండ్రులు పిల్లలను పర్యవేక్షించాలన్నారు.గ్రామాలలో సమస్యలు ఉన్న,చట్ట వ్యతిరేకమైన గంజాయ్,గుట్కా తదితర అక్రమ దందాలు నిర్వహించిన డయల్ 100 కి కాల్ చేయాలన్నారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad