Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుబస్సుల కోసం ప్రయాణికుల నిరీక్షణ..

బస్సుల కోసం ప్రయాణికుల నిరీక్షణ..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ బస్టాండ్ లో ప్రయాణికులు బస్సుల రాక కోసం వేయికళ్ళతో వేచిచూస్తున్నారు. అయినా సమయానికి కాదుకదా.. అప్పుడప్పుడైనా బస్సులు రాకపోవునా.. అని ఎదురుచూడడమే తప్ప బస్సులు వస్తే ఒట్టు. దీంతో మండల కేంద్రానికి ఏదైనా అవసరానికి రావాలన్నా.. ప్రజలు జంకుతున్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు బస్సుల కోసం స్టేజీల పైనా.. బస్టాండ్ లో గంటల తరబడి వేచి చూసినా.. బస్సులు రావడం లేదని, పట్టించుకోవాల్సిన ప్రజా ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం నిత్యం పరిపాటిగా మారింది. కొన్నేళ్లుగా బిచ్కుంద – జుక్కల్ లోకల్ బస్ నడపకపోవడం వలన, ప్రయివేట్ వాహనదారులు విర్రవీగుతున్నారు. పేద ప్రయాణికులు ఆర్థికంగా నష్టపోతున్నారు. గతంలో లోకల్ బస్సులు బిచ్కుంద –  జుక్కల్  కు నడిచేవేని. ప్రస్తుతం రెగ్యులర్ బస్సులు నడపకపోవడం వలన ప్రయాణికులకు ఇబ్బంది తప్పడం లేదు.  జుక్కల్ బస్టాండ్ ప్రాంతానికి తెలంగాణతో పాటు మహారాష్ట్ర , కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వ్యాపార నిమిత్తం ఇతర అవసరాలకు, బంధువుల వద్దకు వస్తుపోతూ ఉంటారు. బస్సులు సమయానుకులంగా నడపకపోవడంతో పాటు ఇప్పటికే రెగ్యులర్ గా వచ్చే షెడ్యూల్ బస్సులు కూడా రద్దు చేయడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గరవుతున్నారు. అదేవిధంగా జుక్కల్ నుండి మహారాష్ట్రలోని దెగ్లూర్ కు వెళ్లే బస్సు ఒక్కటి మాత్రమే ఉండడంతో రాకపోకలకు  జుక్కల్, మద్నూర్ మండలాలలోని గ్రామాల ప్రయాణికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంకొక బస్సు జుక్కల్ నుండి దెగ్గుర్ కు నడపడానికి వీలు ఉన్నా నడపకపోవడం ఆర్టీసీ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇప్పటికైనా టిఎస్ఆర్టిసి అధికారులు జుక్కల్ కు, దెగ్లూర్ కు, మండలంలోని తారు రోడ్ లో ఉన్న గ్రామాలకు గ్రామాల ప్రాంతాలకు  బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. వచ్చే కొన్ని బస్సులైనా సమయపాలన పాటించాలని కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad