నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దాయాది పాకిస్థాన్‌తో భారత్ ఎలాంటి ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఆడబోదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. “మేము ఉగ్రదాడి బాధితులతోనే ఉన్నాం. ఈ పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకపై భవిష్యత్తులో పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లలో ఆడం. కానీ, ఐసీసీ ఈవెంట్ విషయానికి వస్తే, దాని నిబంధనల కారణంగా మేము ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏమి జరుగుతుందో ఐసీసీకి కూడా తెలుసు” అని ఆయన స్పోర్ట్స్ టాక్‌తో అన్నారు .
- Advertisement -