Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్జనగామలో విద్యార్థినులను సన్మానించిన ఉపాధ్యాయులు..

జనగామలో విద్యార్థినులను సన్మానించిన ఉపాధ్యాయులు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జనగామ జిల్లాకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు మాత్రం విద్యా సంవత్సరం మొత్తం ఒక్క రోజు కూడా బడికి గైర్హాజరు కాకుండా వంద శాతం హాజరు నమోదు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వారి నిబద్ధత, క్రమశిక్షణను గుర్తించిన ఉపాధ్యాయులు వారిని ప్రత్యేకంగా సన్మానించారు. వివరాల్లోకి వెళితే, జనగామ జిల్లా మాన్‌సింగ్ తండా ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న రితిక, 4వ తరగతి చదువుతున్న పార్వతి అనే అక్కాచెల్లెళ్లు ఉన్నారు. గత విద్యా సంవత్సరం (జూన్ 12 నుండి విద్యా సంవత్సరం ముగిసే వరకు) ఒక్కటంటే ఒక్క రోజు కూడా వారు పాఠశాలకు సెలవు పెట్టలేదు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా బడికి హాజరయ్యారు. వీరిద్దరూ వంద శాతం హాజరు నమోదు చేయడమే కాకుండా, పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధిస్తూ చదువులోనూ రాణిస్తున్నారు. విద్యార్థుల పట్టుదల, క్రమశిక్షణను గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు వారిని అభినందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రితిక, పార్వతిలను శాలువాలతో సత్కరించి, వారిని అభినందనలతో ముంచెత్తారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad