– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వినతి
నవతెలంగాణ-చంద్రుగొండ
చుండ్రుగొండ గ్రామపంచాయ తీలోని అయ్యన్నపాలెం గ్రామంలో ఇండ్లపై నుంచి వెళ్లే కరెంటు తీగలు తొలగించాలని సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు రాయి రాజ డిమాండ్ చేశారు. శుక్రవారం అయ్యన్నపాలెం గ్రామంలో సీపీఐ(ఎం) సభ్యులు కరెంటు సమస్య పై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కమిటీ సభ్యుడు రాయి రాజా మాట్లాడుతూ గతంలో విద్యుత్ అధికారులకు అనేక దఫాలుగా మెమోరండాలు ఇవ్వడం జరిగిందని ఇంతవరకు పరిష్కారం చూపలేదని అదేవిధంగా దాసరి వెంకటేశ్వర్లు ఇంటి నుంచి దాసరి సీతారాముల ఇంటి వరకు గల కరెంటు తీగలను తీసివేయాలని, అలాగే పంచాయతీలో గతంలో 11 కెవి విద్యుత్ వైర్లు తొలగించారు, కానీ స్తంభాలను డిస్మెంటల్ చేయాలని, చంద్రుగొండ వైయస్సార్ సెంటర్ నుంచి విద్యుత్ ఓల్టేజ్ సమస్య పరిష్కరించాలని తదితర సమస్యలతో కూడుకున్న వినతి పత్రాన్ని ఏఈ ఎంఎల్.నరసింహారావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, దాసరి సీతారాములు, బడుగు సురేష్, ఆ ప్రాంత సమస్య బాధితులు పాల్గొన్నారు.