Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : లే‌అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 25 శాతం రాయితీతో క్రమబద్ధీకరణకు మరోసారి ఈ నెల 30 వరకు గడవును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, మే 31తో గడువు ముగియగా అధికారుల అభ్యర్థన మేరకు ఈనెల 30 వరకు పొడిగించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఇలంబర్తి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో స్థలాల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వంలోనే అనుమతి ఇవ్వగా దాదాపు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అందులో ఇప్పటి వరకు 7 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించారు. దీంతో ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తంగా ఎల్ఆర్ఎస్‌ దరఖాస్తులతో మరో రూ.10 వేల కోట్ల ఆదాయం రానుంది. కాగా, లే‌అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ ముఖ్య ఉద్దేశం ఇల్లీగల్‌గా ఏర్పాటైన ప్లాట్లను క్రమబద్ధీకరించడం, తద్వారా ప్లాట్ యజమానులకు చట్టపరమైన గుర్తింపు కల్పించడమే లక్ష్యం. అదేవిధంగా ప్లాట్ యజమానులు తమ ప్లాట్లను అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, ఆస్తి హక్కులను పొందేందుకు ఎల్ఆర్ఎస్ దోహదపడుతుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad