Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్లు పార్టీ కార్యకర్తలకే కేటాయింపు

ఇందిరమ్మ ఇండ్లు పార్టీ కార్యకర్తలకే కేటాయింపు

- Advertisement -

బిజెపి మండలాధ్యక్షులు తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్ 
నవతెలంగాణ – తాడ్వాయి 
: మండలంలోని నార్లాపూర్ లో ఇందిరమ్మ ఇండ్లు పేదలకు కాకుండా, వారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, డబ్బులు ఇచ్చిన వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని బిజెపి మండల అధ్యక్షులు తాళ్లపల్లి లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నార్లాపూర్ లో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన నిరుపేదలకు ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులకు, ముడుపులు ఒప్పజెప్పిన వారికి మాత్రమే ఇండ్లు ఇచ్చారని మండిపడ్డారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో ముఖ్య నాయకులు ఇండ్లు పంచుకొని, ముడుపులు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరుగుతుందని అన్నారు . కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేటాయించిన ఇండ్లను అర్హులైన అందరికీ ఇస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తామే పూర్తిగా ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకొని కాంగ్రెస్ కార్యకర్తలకె ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేసి అసలైన నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ  కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చెంగల సుభాష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు భూక్యా శ్రీను, ఓబీసీ మండల అధ్యక్షులు ఎరుకల శ్రీను, బీజేవైయం జిల్లా ప్రధాన కార్యదర్శి మాదరి శ్రీకాంత్, మండల కోశాధికారి అలకుంట చిన్న మండల నాయకులు జీడీ ప్రశాంత్, రమేష్ బూత్ అధ్యక్షులు చంద్రశేఖర్, రెడ్డి వెంకటయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad