Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసెల్‌ఫోన్లు అడగటం గోప్యతకు భంగం కలిగించటమే

సెల్‌ఫోన్లు అడగటం గోప్యతకు భంగం కలిగించటమే

- Advertisement -

ఏసీబీకి కేటీఆర్‌ లేఖ
ఆ ఫోన్లు ఇవ్వాల్సిందే.. : కేటీఆర్‌కు ఏసీబీ మరో నోటీస్‌
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌కు సంబంధించి తన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరటం తన వ్యక్తిగత గోప్యత, స్వేచ్ఛకు భంగం కలిగించటమేనని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుధవారం ఏసీబీకి లేఖ రాశారు. ఈ కారణం చేత తాను వాటినివ్వటం లేదని ఆయన తెలిపారు. అలాగే, అప్పుడు తాను వినియోగించిన సెల్‌ఫోన్లు ప్రస్తుతం తన వద్ద లేవనీ, కొత్తవి వాడుతున్నానని చెప్పారు. వ్యక్తిగత సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఇతరులు చూడటం వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించటమేనని గతంలో న్యాయస్థానాలు కూడా స్పష్టం చేశాయని కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. కాగా, దీనిపై ఏసీబీ స్పందిస్తూ.. ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ విచారణకు సంబంధించి విచారణకు మీ సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తప్పనిసరనీ, వాటిని తమకు అందజేయాలని కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు మరో నోటీసు ఇచ్చారని తెలిసింది. దీనిపై కేటీఆర్‌ ఏ విధంగా స్పందిస్తారోనని అధికారులు ఎదురు చూస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad