Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుహైద‌రాబాద్ వాసుల‌కు గుడ్ న్యూస్‌

హైద‌రాబాద్ వాసుల‌కు గుడ్ న్యూస్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌ : గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దివంగత నాయకుడు పి.జనార్ధన్‌రెడ్డి (పీజేఆర్) ప్లైఓవర్‌గా నామకరణం చేశారు. ప్రారంభోత్సవానికి ముందే పెండింగ్‌లో ఉన్న అన్ని పనులు పూర్తి చేయాలని మేయర్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు సూచించారు. ఈ పైవంతెన అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు ఊరట లభించనుంది. ఓఆర్‌ఆర్‌ నుంచి కొండాపూర్, హఫీజ్‌పేట్ మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. ప్రయాణ సమయం ఆదాతో పాటు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అలాగే కొండాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ విమానాశ్రయం, అక్కడి నుంచి కొండాపూర్ ప్రాంతాలకు ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లే వెసులుబాటు ఈ ప్లైఓవర్ ద్వారా కలగనుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad