Monday, September 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలువేములవాడలో కారు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం

వేములవాడలో కారు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ :  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులు కారు నడిపిన డ్రైవర్‌ వేర్వేరు చోట్ల ముగ్గురిని ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో వ్యక్తి గాయపడ్డారు. రుద్రవరం వద్ద బైకును ఢీకొట్టిన కారు.. ఆగకుండా అలానే వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో దత్తయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు.
అనంతరం వేములవాడ మండలం ఆరేపల్లి వద్ద మరో బైక్ ను కారు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం కారును అక్కడే వదిలిన డ్రైవర్‌.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. కారు నంబర్‌ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -