No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

- Advertisement -

జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్
కీటక జనిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ మొదలగు జ్వరాలు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ అన్నారు. గురువారం మండలంలోని చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కీటక జనిత వ్యాధులపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు కీటక జనిత వ్యాధులపై  అవగాహన కలిగించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దోమల నియంత్రణ, మలేరియా, డెంగ్యూ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ప్రతి మంగళవారము, శుక్రవారం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి తెలియజేశారు. 

వర్షాకాలంలో ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ మొదలగు జ్వరాలు రాకుండా ఉండాలంటే ప్రజలు తప్పనిసరిగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.అదేవిధంగా దోమలను అరికట్టే విధంగా ఇంటిలో దోమ జాలీలను ఏర్పరుచుకోవాలన్నారు. గ్రామాలలో నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి నిర్మూలించాలని సిబ్బందికి సూచించారు. గ్రామాలలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పరిసరాల పరిశుభ్రత పై ప్రజలలో అవగాహన కలిగించాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహించుకుని మందులను తీసుకోవడం ద్వారా జ్వరాన్ని తొందరగా అరికట్టవచ్చునని తెలిపారు. జిల్లాలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హబ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యాధికారిణి డాక్టర్ స్పందన, ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్,హెచ్ సిఓ సత్యనారాయణ, సూపర్వైజర్ స్వరూప, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad