Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఖిల్లా ప్రభుత్వ స్కూల్ సమస్యలను పరిష్కరించాలి 

ఖిల్లా ప్రభుత్వ స్కూల్ సమస్యలను పరిష్కరించాలి 

- Advertisement -

యుఎస్ఎఫ్ఐ డిమాండ్ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: ఖిల్లా ప్రభుత్వ స్కూల్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి అని యుఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఏ మేరకు గురువారం భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఖిల్లా ప్రభుత్వ పాఠశాలలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు బాబురావు మాట్లాడుతూ.. యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యాసంస్థలలో సమస్యల అధ్యయన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఉన్న ఖిల్లా ప్రభుత్వ పాఠశాలలో సర్వే నిర్వహించటం జరిగింది అని అన్నారు. అయితే ఖిల్లా ప్రభుత్వ పాఠశాలలో బయో సైన్స్ సబ్జెక్ట్ కు టీచర్ లేరని,అలాగే లైబ్రరీ కూడా లేదని సర్వే లో తెలుసుకోవటం జరిగింది అని అన్నారు.అలాగే స్కూల్ పరిసరాల్లో ఆకతాయిలు తిరగటం వలన విద్యార్థినిలు ఇబ్బందులు ఎదుర్కుంటున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడు అని అన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఖిల్లా ప్రభుత్వం పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ నగర నాయకులు వరదరాజ్,మారుతి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad