Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఏఈపై కాంట్రాక్టర్ దౌర్జన్యం.!

ఏఈపై కాంట్రాక్టర్ దౌర్జన్యం.!

- Advertisement -

నిరసనగా మున్సిపల్ ఉద్యోగుల పెన్ డౌన్ 
నవతెలంగాణ – దుబ్బాక 
: బిల్లులు చెల్లించాలంటూ ఓ కాంట్రాక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఏఈ పై దుర్భాషలాడుతూ ఆయన మొబైల్ ఫోన్ ను ధ్వంసం చేసిన ఘటన దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జరిగింది. దీనికి నిరసనగా గురువారం ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ పెన్ డౌన్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఏఈ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ, మున్సిపాలిటీ పనుల కోసం పట్టణ కేంద్రానికి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యులు ఆస స్వామి తన జేసీబీని వినియోగిస్తున్నారు. కొంతకాలంగా తనకు రావలసిన బిల్లులు చెల్లించాలంటూ ఏఈని పట్టుబట్టాడు. పనులకు సంబంధించిన కొన్ని ఫోటోలు రికార్డుల్లో లేవని, వాటిని జత చేస్తే బిల్లులు చెల్లిస్తానంటూ ఏఈ తెలిపారు. దీంతో సహనం కోల్పోయిన ఆ కాంట్రాక్టర్  ఏఈ పై దుర్భాషలాడుతూ ఆయన ఫోను ధ్వంసం చేశాడు. దీన్ని నిరసిస్తూ మున్సిపల్ ఉద్యోగులు బుధవారం పెన్ డౌన్ ప్రకటించి విధులను బహిష్కరించారు. మేనేజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ కు వినతిపత్రం అందించారు.అనంతరం పోలీస్ స్టేషన్ లో కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ నిరసనలో మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad