Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రయివేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

ప్రయివేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

ఎన్. హెచ్.ఆర్సీ మండల అధ్యక్షుడు మల్లేష్ 
నవతెలంగాణ – పెద్దవంగర
: జిల్లాలో నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్. హెచ్.ఆర్సీ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి మల్లేష్ అన్నారు. ఎన్. హెచ్.ఆర్సీ ప్రతినిధులతో కలిసి మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, డీఈవో డాక్టర్ రవీందర్ రెడ్డి లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రైవేటు, కార్పొరేట్‌ యాజమాన్యాలు విద్యను వ్యాపారం చేస్తూ విచ్చలవిడిగా పాఠశాల ఆవరణలోనే నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, ఇతర స్టేషనరీ మొత్తం కూడా అమ్ముతూ పేద విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి విద్యను వ్యాపారం చేస్తున్నారని వేల రూపాయలు పాఠ్యపుస్తకాల పేరిట వసూలు చేస్తున్నారన్నారు. అదేవిధంగా జిల్లాలో కొన్ని కార్పోరేట్‌ పాఠశాలలు అనుమతులు లేకుండా నడుస్తున్నాయని అడ్మిషన్లు చేస్తున్నారని వెంటనే అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకుని పాఠశాలలను సీజ్‌ చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మెరుగు సందీప్ కుమార్, కోఆర్డినేటర్ తలారి మాధవన్, కిరణ్ కుమార్, భాస్కరా చారి, రాము తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad