డియం అండ్ హెచ్ ఓ రాజశ్రీ
నవతెలంగాణ – కంఠేశ్వర్ : క్షయ వ్యాధిని అంతమొందించడానికి క్షయ రహిత సమాజమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది 2030 నాటికి టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా ఈ వ్యాధి నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టినది. టీవీ ముక్త్ భారత్ కార్యక్రమంతో వందరోజుల టీబి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు వైద్య సిబ్బంది రంగంలోకి దిగారు. ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కలిగించడం టిబి రోగులకు పోషకాహారాన్ని ఆర్థిక సహాయం అందించనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని టీబీ వ్యాధి ఎప్పుడైనా ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉన్నాయని అది ధనిక పేద అనే భేద భావాలు చూడకుండా ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శానిటేషన్ వర్కర్స్ అందరూ జాగ్రత్తలు పాటిస్తూ తమ విధులు నిర్వహించాలని, గుంపులుగా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. టీబీ లక్షణాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని రెండు వారాలకు మించి ఎవరికైతే దగ్గు ఉన్న ఆకలి లేకపోయినా బరువు తగ్గిన చెమటలు పట్టడం, రక్తపు చారలు కనబడిన వారందరూ కూడా టీబి కి సంబంధించిన పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలి. నిజాంబాద్ జిల్లాలో ఈరోజు నుండి సరిగ్గా ఐదు రోజుల వరకు మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క సానిటరీ వర్కర్స్ అందరికీ టిబి, హెచ్ఐవి, హైపెటైటిస్ బి & సి ,సిఫిలిస్, బిపి డయాబెటిక్ వంటి అంటే వాటికి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు, అలాగే డిటిసి ఓ మరియు డి ఎం అండ్ హెచ్ ఓ చేతులమీదుగా టీబి రోగులకు ఫుడ్ బాస్కెట్స్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా టీబి నియంత్రణ అధికారిని డాక్టర్ దేవి నాగేశ్వరి, జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ ఆఫీసర్ డాక్టర్ అశోక్, మున్సిపల్ ఆఫీసర్ వాహిద్ ఆలి, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, హెల్త్ ఎడ్యుకేటర్ ఘన్పూర్ వెంకటేష్,జిల్లా పిఎండిటి కోఆర్డినేటర్ రవి, డి.పీ.సీ. లక్ష్మణ్, పి.పి.ఎం. కోఆర్డినేటర్ నరేష్ శ్యామల, విజయ మాల ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపాలిటీ సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES