No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్బ్రాహ్మణపల్లి గ్రామంలో నూతన వరిసాగు విధానం 

బ్రాహ్మణపల్లి గ్రామంలో నూతన వరిసాగు విధానం 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో దామల క్రాంతి వ్యవసాయ క్షేత్రంలో మొట్టమొదటిసారి సిటీ గ్లోబల్ మార్కెట్ వారి సహకారంతో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వారు నూతన వరి సాగు విధానాన్ని వేయించడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డిస్ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ ఈ పద్ధతిని అనుసరించి వరి సాగు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతోపాటు వాతావరణ కాలుష్యానికి కారణమైన మీథేన్ కార్బన్డైయాక్సైడ్ వాయువులు విడుదలయ్యే శాతాన్ని తగ్గించవచ్చు, తద్వారా వాతావరణ కాలుష్యం కొంతవరకు తగ్గించవచ్చు .సాంప్రదాయ పద్ధతితో వరి సాగు చేయాలంటే దమ్ము చేసి తర్వాత బురద నీటిలో నాట్లు వేయాలి ఇందుకు నీటివినియోగం పెరగడంతో పాటు పెట్టుబడి కూడా ఎక్కువగానే అవుతుంది.వాతావరణ మార్పులకు అనుగుణంగా నీటి వినియోగాన్ని తగ్గిస్తూ, పెట్టుబడి ఖర్చులను తగ్గించి పర్యావరణహితంగా మెట్ట వరిని సాగు చేసుకోవచ్చు ఈ మెట్ట వరి సాగుకై భూమిని రెండుసార్లు దున్ని గుల్లగా మార్చి చదును చేసుకుని ట్రాక్టర్ వెనకాల మల్టీ క్రాప్ ప్లాంటర్ పరికరాన్ని బిగించి విత్తనం మరియు ఎరువును ఒకేసారి వేసుకోవచ్చు దీనివలన మనకి ఎకరానికి నాటు దుమ్ము ఖర్చు ₹10,000 వరకు ఆదా అవుతుంది.  ఈ కార్యక్రమంలో రైతు దామల క్రాంతి  సంస్థ ప్రతినిధుల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ సునూత్న, సుస్మిత, ఫీల్డ్ ఆఫీసర్ బట్టు ప్రణీత్,  జాన్, గంగాసాయన్న,కిషోర్, మోహన్ తదితరులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad