No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్ఎస్ఎఫ్ఐ 18వ జాతీయ మహాసభలను విజయవంతం చేయండి

ఎస్ఎఫ్ఐ 18వ జాతీయ మహాసభలను విజయవంతం చేయండి

- Advertisement -

ఐటిఐ గర్ల్స్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ జెండా ఆవిష్కరణ
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: ఎస్ఎఫ్ఐ 18వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ ) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా నగరంలోని ఐటిఐ గర్ల్స్ కళాశాలలో జిల్లా కమిటీ సభ్యులు రోహిత్ జండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు రోహిత్ మాట్లాడుతూ.. ఎస్ఎఫ్ఐ 1970లో పురుడు పోసుకుని 55 సంవత్సరాల కాలంలో అమరుల త్యాగాలను పునికి పంచుకొని విద్యారంగ సమస్యల పైన అనేక పోరాటాలు నిర్వహించి ఛాంపియన్ నిలుస్తుందని అన్నారు.

అదే విధంగా అధ్యయనం పోరాటం నినాదాలతో విద్యార్థులు అనేక పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాలను నిలదీస్తున్నా ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని కొనియాడారు. అదేవిధంగా చదువు అనేది మన హక్కు – ఐక్యత మన మార్గం – వైవిధ్యం మన బలం 18 వ జాతీయ మహాసభ ఇచ్చిన నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహించి రాష్ట్రాల హక్కులను కాపాడుకోవాలని అన్నారు. జూన్ 27 – 30 తేదీలలో కేరళలోని కోజికోడ్ ప్రాంతంలో జరగబోయే 18 వ జాతీయ మహాసభలకు తరలి వచ్చి విజయవంతం చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటిఐ యూనిట్ కమిటీ సభ్యులు సాయి కృష్ణ, రేవంత్, కీర్తి రాజ్, మహేశ్వరి, శ్రీజ, బాబు రఘు, కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad